
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ( VIJAY DEVARAKONDA) ఈడీ (ED)విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ (BETTING APP CASE) కేసులో ఈడీ నోటీసులు పంపిన నేపధ్యంలో హీరో విజయ్ దేవర కొండ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. హీరో విజయ్ దేవర కొండ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో దగ్గుపాటి రాణా మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా ప్రకాశ్ రాజ్ (PRAKASH RAJ) విచారణ పూర్తి కాగా హీరో విజయదేవర్ కొండను ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. రాణా(RANA DAGGUPATI) కు ఆగస్టు 11న హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది, మంచు లక్ష్మి (MANCHU LAXMI) ఆగస్ట్ 13న ఈడీ ఎదుట హాజరు కానున్నారు.విజయ్ దేవరకొండను మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న నగదు, కమీషన్లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. చట్టవిరుద్ధమైన యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను విచారణ చేస్తున్నారు.
…………………………………………..