* గురుగ్రామ్ లో తీవ్ర ఉద్రిక్తత
ఆకేరు న్యూస్ డెస్క్ : ఢిల్లీ శివారులోని గురుగ్రామ్(Gurugram)లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రొట్టె విషయంలో చెలరేగిన చిన్న హింస గొడవకు దారి తీసింది. హర్యాన గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్(Restaurent) వద్దకు టిఫిన్ చేయడానికి కొందరు వచ్చారు. మాడిపోయి.. తినడానికి పనికిరాని రొట్టె(Rotte)ను ఇచ్చారని కొందరు రెస్టారెంట్ నిర్వాహకులతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన కొందరు అల్లరిమూకలు కారును తగులబెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
………………………………………….