* 84వ శతకం పూర్తి చేసిన కోహ్లీ
* చరిత్రలో మరో మహత్తర ఘట్టం
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత క్రికెట్ రత్నం విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుత ప్రతిభను చాటుతూ తన 84వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. టెస్టులు, వన్డేలు, టీ20లుగా మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ తన స్థాయిని మరోసారి నిరూపించాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో కలిపి 84 సెంచరీలు పూర్తి చేశాడు. ఇంకా 16 సెంచెరీలు సాధిస్తే సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఇవే కాకుండా ఐసీఎల్ మ్యాచు్లో కోహ్లీ 8 సెంచెరీలు చేశాడు.
