* ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో మొదలైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ
* తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పార్లమెంట్ నూతన భవనంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోదీ మొదటగా పార్లమెంట్ భవనం చేరుకొని మొట్టమొదటి ఓటు వేశారు
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఎన్డీయే అభ్యర్థిగా
సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.
రాధాకృష్ణన్ ప్రత్యేక పూజలు
ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఓటింగ్ కు మందు ఢిల్లీ లోథి రోడ్ లో
ఉన్న శ్రీరామ మందిర్లో ప్రత్యేక పూజలు చేశారు. భారత జాతీయవాదం
పెద్ద విజయం సాధించనుందని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా అన్నారు.
………………………………………..
