* అర్థరాత్రి.. ఐదు గంటలు..
* అవస్థలు పెట్టిన కావేరి ట్రావెల్స్..
* పట్టించుకోని యాజమాన్యం
* పోలీసుల జోక్యంతో మరో బస్సులో ప్రయాణం
ఆకేరు న్యూస్, బాపట్ల : కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణీకులను 5 గంటల పాటు ఇబ్బందులకు గురి చేసింది. బాపట్లలోని సంతమాగులూర్ మండలం ఏల్చూరు వద్ద ఆగిపోయింది. శనివారం అర్థరాత్రి 2:30 గంటలకు 36 ప్రయాణీకులతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలు దేరింది. బస్సులో తలెత్తిన సాంకేతిక కారణాలతో అర్థరాత్రి ఆగిపోవడంతో బస్సు డ్రవైర్ తమ యజమానికి సమాచారం అందించాడు. కొద్దిసేపటి తరువాత ప్రయాణీకులు బస్సు ఎందుకు ఆగిందని డ్రైవర్‌ను అడగడంతో చిన్న సమస్య తలెత్తిందని.. కొద్దీసేపటికే బస్సు బయలు దేరుతుందని చెప్పాడు. దీంతో ప్రయాణీకులు కునుకుతీశారు. తెల్లవారినా.. ట్రావెల్స్ యజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రయాణీకులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యజమానితో మాట్లాడి ప్రయాణీకులను వేరే బస్సులో పంపించారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులోనే 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.
……………………………………….
