
ఆకేరు న్యూస్ డెస్క్: ఆయన నడుస్తే స్టైల్.. నవ్వితే స్టైల్.. మాట్లాడితే స్టైల్..ఫైట్ చేస్తే స్టైల్ ..సిగరెట్ తాగితే స్టైల్ టోటల్‌గా ఆయనే ఓ స్టైల్… ఆయనెవరో కాదు సూపర్ స్టార్.. తలైవా.. రజనీకాంత్(RAJNI KANTH) ఒక్క ఇండియాలోనే కాదు తన మ్యానరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన అసాధారణ నటుడు. .టికెట్ తీసుకొని థియేటర్ లో కూర్చున్న ప్రేక్షుకులు రజనీ ఎంట్రీ ఎలా ఉంటుందో అనే కుతూహలంతో చూస్తారు. బాలచందర్ ఆశీస్సులతో సినిమా రంగంలో అరంగేట్రం చేసినప్పటి నుండీ ప్రేక్షకుల్లో ఆదే ఆదరణ.అదే అభిమానం..మహారాష్ట్రలో పుట్టి..కర్ణాటకలో కొలువు చేసి తమిళనాడులో స్థిరపడి యావత్ భారతదేశ ప్రజలు సొంతం చేసుకున్న నటుడు రజనీకాంత్ ..
కూలీ కోసం ఎదురుచూపులు
రజినీ నటించిన కూలీ (COOLIE)ఏప్రిల్ 14న విడుదల కానున్నది.. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఆబాలగోపాలం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్మడు పోయినట్లు చెప్తున్నారు.
రేర్ కాంబినేషన్
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కూలీ సినిమాలో రేర్ కాంబినేషన్ లో రాబోతోంది. రజనీతో పాటు ఈ సినిమాలో నాగార్జున(NAGARJUNA) ,అమీర్ ఖాన్(AMIRKHAN),సోబిన్ షాహిర్ శృతి హాసన్(SRUTHI HAASAN) లు నటిస్తున్నారు.అమీర్ ఖాన్ ఈ సినిమాకు స్పిషల్ అప్పియరెన్స్‌లో స్పెషల్ గా కన్పిస్తారని చెప్తున్నారు.
డిఫెరెంట్ పాత్రలో నాగార్జున
ఈ సినిమాలో నాగార్జున విలన్ గా కన్పించ బోతున్నాడట.. అసలు నాగార్జున వేసిన పాత్రను ముందుగా రజనీకాంత్ వేయాలనుకున్నారట. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ అంగీకరించలేదు.. ఈ పాత్రలో విలన్ చాలా స్టై ల్ గా నాజూకుగా ఉండాలని రజనీతో చెప్పారట.. ఆరు నెలలు నాగార్జున కాల్ షీట్ల కోసం తిరిగి ఎట్టకేలకు నాగార్జునను ఒప్పించారట..
లోకేష్ కనకరాజ్ పై భారీ అంచనాలు
ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ (LOKESH KANAKARAJ) దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ ట్రాక్ రికార్డు అలా ఉంది.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని టాప్ లేచిపోయాయి. సందీప్ కిషన్ హీరోగా మొదటి సినిమా మహానగరంతోనే లోకేష్ తన సత్తా చాటాడు. ఆ తరువాత విజయ్(VIJAY) హీరోగా లియో,మాస్టర్ చేశాడు. కార్తి హీరోగా ఖైదీ సినిమా,, ఇక కమల్ హాసన్ (KAMAL HAASAN) నటించినవిక్రం ఎంత విజయం సాధించిందో తెల్సిందే.. పాత్రల రూప కల్పన ఎంత పెద్ద స్థార్ అయినా తనకు నచ్చిన విధంగా తాను అనుకున్న విధంగా వారితో నటింపచేయడం లోకేష్ ప్రత్యేకత. విక్రంలో కమల్ నటన గురించి వేరే చెప్పాల్పిన పనిలేదు. అందులో మలయాల అగ్రనటుడు పహాద్ ఫాజిల్,(FAHAD FAZIL) విజయ్ సేతుపతి (VIJAY SETHUPATHI) పాత్రలను మార్చిన తీరు అద్భుతం. లోకేష్ ట్రాక్ రికార్డు అలా ఉంది కాబట్టే ప్రేక్షకుల్లో కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
టికెట్స్ సేల్స్‌లో రికార్డు
ఈ సినిమా ఇప్పటికే ప్రీ సేల్స్ బుకింగ్ లో రికార్డు బ్రేక్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల టికెట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడంఖాయమని అంటున్నారు.
ఉదయనిధి స్టాలిన్ ట్వీట్
తమిళనాడు ఉపముఖ్యమంత్రి నటుడు ఉదయనిధి స్టాలిన్ (UDAYANIDHI STALIN) ఈ సినిమా గురించి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఈ సినిమా కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని అందులో పేర్కొన్నారు.
…………………………………………………….