* గోవాలో వరల్డ్ కప్ చెస్ పోటీలు ప్రారంభం
* పోటీల్లో పాల్గొంటున్న అర్జున్ ఇరగైసీ
ఆకేరు న్యూస్, హనుమకొండ్ : ప్రతిష్టాత్మకమైన చెస్ వరల్డ్ కప్ శనివారం గోవాలో ప్రారంభం కానుంది.
హన్మకొండ నగరానికి చెందిన అర్జున్ ఇరగైసీ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 14 సంవత్సరాల, 11 నెలల, 13 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ బిరుదును సంపాదించిన అర్జున్ సెప్టెంబర్ 2024లో అతను భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన ఆటగాడిగా నిలిచాడు .అర్జున్ తండ్రి నగరంలో ప్రముఖ న్యూరో సర్జన్ కాగా తల్లి గృహిణి . భారత దేశం లో 54 వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. 80 దేశాల నుంచి మొత్తం 206 మంది ఆటగాళ్లు టోర్నీలో తలపడుతున్నారు. భారత్ నుంచి ప్రజ్ఞానంద,ప్రపంచ చాంపియన్ గుకేష్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసీ తదితర స్టార్లు బరిలో ఉన్నారు. ఈ వర్ల్డ్ కప్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు 2026 ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించనున్నారు. దీంతో ప్రపంచ కప్ ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాండిడేట్స్ టోర్ని ద్వారా ప్రపంచ చాంపియ గుకేష్ తలపడే ఆటగాడిని నిర్ణయిస్తారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఆర్జున్ కు ప్రపంచకప్ కీలకం కానుంది. ఇక్కడ సత్తా చాటితే అతడు క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అవుతాడు. 2015 లో కొరియాలో జరిగిన 2015 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో , అర్జున్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అక్టోబర్ 2021లో, బల్గేరియాలో జరిగిన జూనియర్ U21 రౌండ్ టేబుల్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ (క్లాసికల్)లో అర్జున్ 2వ స్థానంలో నిలిచాడు. నవంబర్ 2021లో, రిగాలో జరిగిన లిండోర్స్ అబ్బే బ్లిట్జ్ టోర్నమెంట్లో 82 మంది ఆటగాళ్లలో అర్జున్ 3వ స్థానంలో నిలిచాడు,టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్ అర్జున్ గెలుచుకున్నాడు. మార్చి 2022లో, అతను 8½/11 స్కోరుతో 58వ MPL నేషనల్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2022ను గెలుచుకోవడం ద్వారా ఇండియన్ నేషనల్ ఛాంపియన్‌గా కిరీటాన్ని గెలుచుకున్నాడు. ఇంకా, మార్చిలో అర్జున్ 19వ ఢిల్లీ ఓపెన్‌ను గెలుచుకున్నాడు.
………………………………………………..
