
* రాంచందర్ రావు నేతృత్వంలో అధికారం ఖాయమన్న నేతలు
ఆకేరున్యూస్ వరంగల్ : భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ రాంచందర్ రావుకు వరంగల్ బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు,కొండేటి శ్రీధర్, ఆరూరి రమేష్ లు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వరంగల్ జిల్లా తరుపున వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు,కొండేటి శ్రీధర్,ఆరూరి రమేష్ లు హాజరై ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు విద్యార్థి దశ నుండే నాయకుడిగా ఎదిగాడని కొనియాడారు ఏబీవీపీకి ఆయన మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. రాంచందర్ రావు నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలో బలపడడమే కాకుండా 2029లో అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
……………………………………………