
* నిబంధనల మేరకు చర్యలు తప్పవు
* క్రమశిక్షణ తప్పితే క్షమించేది లేదు
* వరంగల్ వ్యవహారంపై త్వరలో నిర్ణయం
* కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః పార్టీ లైన్ ప్రకారం మితిమీరి ప్రవర్తించిన నేతలపై చర్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవి అన్నారు.గాందీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వరంగల్ లో మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగింది. ఈ వ్యవహారంపై ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.అలాగే గజ్వేల్ లో స్థానిక నాయకత్వంపై ఫిర్యాదులు అధిష్టానానకి చేరాయని మల్లు రవి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీ పరువు పోకుండా ఉండాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పార్టీ నేతలను ఎలా కట్టడి చేస్తారో చూడాలి.
సినిమా డైలాగులు చెల్లవు
సినిమా డైలాగులు వినడానికి బాగుంటాయి కాని రాజకీయాల్లో అవి చెల్లవు అని మల్లు రవి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ఆ ధ్వర్యంలో రైతులు శనివారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మానిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి లు పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది రప్పా.. రప్పా ప్లకార్డులు ప్రదర్శించారు. 2028లో రప్పా..రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులతో గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన మల్లు రవి ఈ డైలాగులు వినడానికి బాగుంటాయి… కానీ రాజకీయాల్లో చెల్లవని హెచ్చరించారు. రాజుల కాలంలో రప్పా రప్పా ఆడించేది ఉండేదని అన్నారు. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్యమని… ఇక్కడ రప్పా రప్పా అంటే చెల్లదని వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని అన్నారు.
………………………………………….