
* త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ
* అల్లా దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది’’ అని అన్నారు. అల్లాప్ా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో ప్రజలు సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు.
…………………………………..