* సకాలంలో ఆస్పత్రికి తరలింపు
* క్షేమంగా బయట పడ్డ మహిళ
ఆకేరు న్యూస్, వరంగల్ : ఎస్సై మానవత్వంతో వ్యవహిరించి సకాలంలో స్పందించడంతో ఓ మహిళ ప్రాణాపాయ స్థితి నుండి బయట పడింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ మండి బజార్ ప్రాంతానికి చెందిన గౌసియా బేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో కలిసి నడస్తూ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇంతెజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు అతని సిబ్బంది మహిళ పరిస్థితి గమనించి వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. లో బీపీ కారణంగా మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మహిళకు చికిత్స అందించి కుటుంబసభ్యలుకు సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి మహిళను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు స్పందించిన తీరుకు మహిళ కుటుంబసభ్యులతో పాటు అందరూ అభినందిస్తున్నారు.
…………………………………………………………………….

