
* రెండు గేట్లు ఎత్తివేసిన అధికారులు
ఆకేరున్యూస్,కొత్తగూడెం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో కిన్నెరసాని నిండుకుండలా మారింది. కిన్నెరసాని నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి వేశారు. మహబూబాబాద్, పాకాల కొత్తగూడ నుంచి గుండాల అటవీ ప్రాంతాల మీదుగా ఇల్లెందు,కొత్తగూడెం, టేకులపల్లి ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేసిన సందర్భంగా దిగువ,లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
………………………………………