
* భవిష్యత్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్
* మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ సత్తా చాటాం
* ప్రపంచ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చాం
* టూరిజం అభివృద్ధి లో ముందడుగు
ప్రతిపక్షాలవి పసలేని విమర్శలు
* మంత్రి జూపెల్లి కృష్ణారావు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా నిర్వహించి తెలంగాణ సత్తా చాటాం అని టూరిజం శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు అన్నారు.. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపెల్లి మాట్లాడారు. మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ పటంలో తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు మంచి గుర్తింపు వచ్చాంది అని మంత్రి జూపెల్లి అన్నారు.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తీరును చూసి ప్రపంచ దేశాలే నివ్వెర పోయాయని మంతి అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశామని మంత్రి అన్నారు. మే 6 నుంచి 31 వరకు సాగిన ఈ పోటీల్లో అన్ని ఈవెంట్లు దిగ్విజయంగా జరిగాయని మంత్రి అన్నారు..తెలంగాణ చారిత్రిక ప్రదేశాలను , సంస్కృతీ సాంప్రదాయాలను చూసి పోటీలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ అబ్బురపోయారని మంత్రి అన్నారు.. వారి ద్వారా తెలంగాణ గొప్పదనం మరింత వ్యాప్తి చెందుతుందని మంత్రి అన్నారు. రామప్ప దేవాలయం.. యాదగిరిగుట్ట, బుద్దవనం,పిల్లలమర్రి,వేయిస్తంబాల గుడి, ఏఐజీ హాస్పిటల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ మొదలైన ప్రదేశాలను సందర్శించిన పోటీదారులు తెలంగాణ ప్రత్యేకతను వేగంగా అభివృద్ధి చెంతున్న తీరును
చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని మంత్రి అన్నారు
హస్తకళలకు ప్రోత్సాహం
తెలంగాణ అద్భుతమైన హస్తకళలకు నిలయమని చేనేత రంగంలో కళాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలంగాణ చేనేత రంగాన్ని తెలంగాణ చేనేత కార్మికుల పనితన్నాన్ని ప్రపంచానికి తెలియజేశామని మంత్రి అన్నారు. ఈ పోటీలు తెలంగాణ కుటీరపరిశ్రమలకు ముఖ్యంగా చేనేత రంగానికి ప్రమోసన్గా పనిచేశాయని మంత్రి అన్నారు.
పైసా ఖర్చు కాకుండా ప్రపంచ స్థాయి గుర్తింపు
ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాట్లుగా ఈ పోటీల్లో ప్రజాధనం దుర్వినియోగం కాలేదని కేవలం 31 కోట్లు మాత్రం ఖర్చు చేశామని అందుల్లో 21 కోట్ల రూపాయలు స్పాన్సర్ల ద్వారా అందాయని మిగతా పది పన్సెండు్ల కోట్ల రూపాయలు రావాల్సిఉందని మంత్రి అన్నారు.
ఓర్వ లేక దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ ఎస్
మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ కావడం బీఆర్ ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదని మంత్రి విమర్శించారు.
గత పదేళ్ల కాలంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం టూరిజం ప్రమోషన్ కోఐసం 115 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి విమర్శించారు. 2016, 17 సంవత్సరానికి గాను టూరిజం ప్రమోషన్ కోసం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం 27 కోట్ల 84 లక్షలు ఖర్చు చేసిందని.. 2017. 18 సంవత్సరానికి గాను 19 కోట్లు 2018 19 కిగాను 15 కోట్లు
2019 20కి గాను 11 కోట్లు ఖర్చుచేశారని మంత్రి గుర్తుచేశారు.సీఎం రేవంత్ రెడ్డ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైసా ఖర్చుకాకుండా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించి ందన్నారు. దీంతో ప్రపంచ వ్యప్తంగా తెలంగాణలో టూరిజానికి ప్రమోషన్ లభించిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో టూరిజం అభివృద్ధి చెందడమే కాకుండా పెట్టుబడులు కూడా వెల్లువలా వస్తాయని మంత్రి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మంత్రి అన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
స్వంత పత్రికలు.. స్వంత చానళ్లతో దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి విమర్శించారు. కోట్లు ఖర్చు చేస్తో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. కేటీఆర్, హరీష్ రావులకు నిజాయితే ఉంటే చేస్తున్న ప్రచారం ఆపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి అన్నారు. బీఆర్ ఎస్ నాయకుల చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని రుజువు చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని చర్చ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా తాను సిద్దంగా ఉన్నానని మంత్రి జూపెల్ల కృష్ణారావు సవాల్ విసిరారు.
……………………………………………..