* సీఎం, హరీశ్ ఒకే విమానంలో వెళ్తే కాళ్లు మొక్కినట్టా
* రిజర్వేషన్ల అంశం తేలాకే స్థానిక ఎన్నికలు
* గవర్నర్ ను కలిసి తీర్మానం ఆమోదించాలని కోరాం
* టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అఖిలపక్షం నేతలతో గవర్నర్ ను కలిశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Maheshkumar Goud) తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని కోరామని వెల్లడించారు. తమ విజ్ఞప్తి గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశం తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. కమిటీలు లేకపోయినా కాంగ్రెస్ (Congress) పార్టీని బలోపేతం చేశామని, పది రోజుల్లో అన్ని కమిటీలనూ పూర్తి చేస్తామని చెప్పారు. పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక పూర్తి చేశామన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇళ్ల ఎంపికలో కార్యకర్తల జోక్యం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం(Cm), హరీశ్ (Harish) ఒకే విమనాంలో వెళ్తే కాళ్లు మొక్కినట్టా అని కవిత వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. తాను, కవిత (Kavitha)ఒకే విమానంలో చాలా సార్లు ప్రయాణించామని, అంత మాత్రాన ములాఖత్ అయినట్టా అని ప్రశ్నించారు.
…………………………………………
