
*ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
* మరోసారి రేవంత్ ని టార్గెట్ చేసిన రాజగోపాల్ రెడ్డి
ఆకేరున్యూస్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన
వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానుకోని పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మునుగోడు పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవులపై ఎలాంటి ఆశ లేదని తాను మంత్రిని కావాలనుకుంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చే వారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.అందరూ కలిసి కష్టపడితేనే తెలంగాణలో కాంగ్రెస్మ
పార్టీ అధికారంలోకి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.మంత్రి పదవి కోసం ఎవరినీ బతిమాలాడాల్సిన అవసరం తనకు లేదని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
…………………………………….