
* నాలుగు కోట్ల జనాల ఆకాంక్షను నాలుగు నెలలుగా తొక్కిపెడుతున్నారు
* మోదీని గద్దె దించేది రాహుల్ గాంధీనే..
* 2029లో బీజేపీ 150 సీట్లను దాటనివ్వం
ఆకేరు న్యూస్,డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ( NARENDRA MODI)మెడలు వంచి రిజర్వేషన్లు సాధించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్ (BC RESERVATION BILL)ఆమోదం కోసం బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణ ఎంపీలు,ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలు,స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఇండియా కూటమి నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించి నాలుగు నెలలు కావస్తున్నా ఇంత వరకు కేంద్రం ఆమోదం తెలపడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టవలసి వచ్చందన్నారు. నరేంద్ర మోదీకి బిసీ రిజర్వేషన్లపై ఉన్న వైఖరిపై ఢిల్లీ నుంచే సవాల్ విసురుతున్నామని రేవంత్( REVANTH REDDY) అన్నారు. విద్యలో ఉద్యోగాలతో పాటు రాజకీయంగా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తే ఇంత వరకు ఆమోదం తెలపడం లేదని నిప్పులు చెరిగారు. భారత్ జోడా యాత్ర సందర్ఢంగా రాహుల్ గాందీ ( RAHUL GANDHI) అన్ని వర్గాల కష్ఠాలు విన్నారని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కష్టాలు చూసి రాహుల్ చలించి పోయారని రేవంత్ అన్నారు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి దేశ వ్యాప్తంగా కులగణనకు రాహుల్ ఆలోచన చేశారని రేవంత్ అన్నారు. ఆయన ఆశీస్సులతో తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంత వరకు దాదాపు 300 వందల మంది ముఖ్యమంత్రులు అయ్యారని ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తెలగాణ ప్రభుత్వం చేసిందని కులగణన చేపట్టి మొత్తం దేశానికి దిశా నిర్దేశం చేసిందని రేవంత్ అన్నారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్ ఆమోదించి పంపితే దాన్ని ఆపే అధికారం మీకెక్కడిదని మోదీని ప్రశ్నించారు.2019లో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎదగకుండా పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చారని ఆ చట్టాన్ని చెత్త బుట్టలో వేసి బీసీలకు న్యాయం జరిగేలా కొత్త చట్టాన్ని రూపొందించామని రేవంత్ అన్నారు. కేసీఆర్ చేసిన చట్టం గుదిబండగా ఉన్న నేపధ్యంలో ధైర్యంగా అందరి మద్దతుతో కొత్త చట్టాన్ని తెచ్చామన్నారు.
ఇందిరమ్మే ఆదర్శం
ఈ దేశానికి ఇందిరమ్మా ఆదర్శం అని సీఎం రేవంత్ అన్నారు. దేశానికి ఇందిరమ్మ(INDIRA GANDHI) చేసిన సేవలను ప్రజలు ఇంత వరకూ మరిచిపోలేదన్నారు అందుకే ఆమె అందరిచేత అమ్మ అన్పించుకుంంది అన్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు భూమి లేని వారికి భూమి ఇచ్చి ఇందిరమ్మ అందరి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రేవంత్ అన్నారు. ఆనాడు రాజీవ్ కంప్యూటర్లను ఇండియాకు పరిచయం చేయకపోతే నేడు దేశం ఇంత అభివృద్ధి సాధించేదా అని రేవంత్ ప్రశ్నించారు. రెడ్లు,రావులు,చైదరీలు ఈరోజు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో రాజ్యమేలుతున్నారంటే అనాడు రాజీవ్ గాంధీ పెట్టిన భిక్ష కాదా అని రేవంత్ ప్రశ్నించారు. వారి వారసుడిగా రాహుల్ గాంధీ దేశప్రజల క్షేమం కోసం తపిస్తున్నారని రేవంత్ అన్నారు. దేశంలో కులగణన జరిగి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడమే రాహుల లక్ష్యం అని రేవంత్ అన్నారు దేశంలోని బడుగు బలహీనవర్గాలకు రాహుల్ న్యాయం చేసి తీరుతారని రేవంత్ అన్నారు. ఆరోజు తొందరలోనే ఉందన్నారు.
కేసీఆర్‌ది డ్రామాల కుటుంబం
కేసీఆర్ దీ డ్రామాల కుటుంబం అని రేవంత్ అన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణలో బీసీలకు అన్యాయం చేశారని రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబంలోనే బీసీ రిజర్వేషన్లప ఏకాభిప్రాయం లేదని రేవంత్ అన్నారు. ఒకరు కావాలంటే మరొకరు వద్దు అంటున్నారని ఎద్దేవా చేశారు
వాజ్‌పేయి మోదీని దిగిపొమ్మన్నారు
2002 లో జరిగిన గోద్రా అల్లర్ల తరువాత ఆనాడు వాజ్‌పేయి మోదీని గద్దె దిగమంటే దిగలేదని రేవంత్ అన్నారు, ఆర్ ఎస్ ఎస్ సిద్దాంతం ప్రకారం 75 ఏళ్లు నిండిన తరువాత పదవినుంచి వైదొలగాలని మోహన్ భగవత్ అంటున్నారని రేవంత్ అన్నారు. బీజీపీ అగ్రనాయకుడు అధ్వాని,మురళి మనోహర్ జోషి లాంటి నాయకులను తప్పించినప్పడుడు మోదీ ఎందుకు దిగిపోకూడదు అని రేవంత్ ప్రశ్నించారు
మోదీని గద్దె దించుతాం.. రాహుల్ ను కూర్చోబెడతాం
2029 ఎన్నికల్లో మోదీనే ప్రధాని అభ్యర్థిగా నిలబెడతాం కొంత మంది బీజీపీ నేతలు అంటున్నారని అలాగే చేయనివ్వండి 2029 ఎన్నికల్లో మోదీ గద్దె దిగడం ఖాయమని రేవంత్ అన్నారు. బీజేపీకి 150 సీట్లు దాటకుండా చేస్తామని రేవంత్ అన్నారు. జంతర్ మంతర్ వేదికగా ఇదే నా శపథం అని రేవంత్ అన్నారు
……………………………………………………….