
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఆకేరున్యూస్, వరంగల్: నిరంతరం సేవలందిస్తూ ప్రజలకు అందుబాటులో వుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనరేట్ కార్యాలయమునకు చేరుకున్న నూతన పోలీస్ కమిషనర్‌కు డిసిపిలు, అదనపు డిసిపిలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం నూతన పోలీస్ కమిషనర్‌గా పూర్వ సిపి అంబర్ కిషోర్ రaా నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వంద శాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరువై నాలుగు గంటలు ప్రజల కొసం పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్ తో పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెందిన ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు ఇతర విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది వున్నారు.
…………………………