
* శాశ్వత పనులు చేపడతాం
* మేడారం జాతరపై మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్ ములుగు : మేడారం జాతర రూపు రేఖలు మార్చి ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇప్పటివరకు జాతర తాత్కాలిక పనులు జరిగాయి. ఇక నుంచి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయనున్నట్లు మంత్రి వివరించారు.జంపన్న వాగు, రోడ్ల వెడల్పుతో పాటు స్మృతి వనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ లో రేపటి నుంచి పనుల జాతర మొదలు అవుతుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, గొర్ల, మేకల షెడ్లు , తదితర పనులు రేపటి నుంచి మొదలవుతాయని మంత్రి తెలిపారు.ఈ పనుల కోసం ప్రభుత్వం 200 కోట్లను నిధులను విడుదల చేసిందని మంత్రి తెలిపారు. మేడారం జాతరలో 12 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.13 వ శతాబ్ది చరిత్రను తర్వాతి తరాలకు అందించాలని జాతరను ప్రతిష్టాకంగా జరుపుతామని సీతక్క తెలిపారు.
………………………………………….