* అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు.
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లాలో విద్య, వైద్యం, సంక్షేమ హాస్టల్లో జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పేర్కొన్నారు. తనిఖీలు చేపట్టినప్పుడు ఉద్యోగులు అందుబాటులో లేకపోయిన, హాస్టల్ లో మెను అమలు చేయకపోయినా, సిబ్బంది విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. శుక్రవారం మంగపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ పాఠశాలలో క్లాసు రూమ్ లను, డైనింగ్ హాలును పరిశీలించారు. ఆయన విద్యార్థులతో సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకొని, తెలుగు, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పోటీ తత్వంలో ముందుకు వెళ్లాలని సూచించారు. మంచిగా చదువుకోని మీ తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు కోరారు. విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు.
ఆరోగ్య కేంద్రంలోని ఇన్బి పేషంట్ వార్డును ,ల్యాబ్ టెక్నీషియన్ గదిని, డెలివరీ రూమును, మందుల నిలువలు గదిని, ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు. ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకెళ్లి ఆరోగ్య పరిస్థితి వివరాలను, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, మందుల నిల్వలా గదులను పరిశీలించి, వైద్య సేవలకు సరిపడా మందులు, ఎమర్జెన్సీ మందుల నిల్వలను ఉంచుకోవాలని, లేనియెడల జిల్లా కార్యాలయానికి ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలని, జ్వరముతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి వ్యక్తికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి టెస్టులను చేయాలని సూచించారు. మండల ఆరోగ్య కేంద్రం పరిధిలోని విద్యార్థిని- విద్యార్థుల వసతి గృహాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని, గ్రామాలలో కూడా అవసర నిమిత్తం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ నియంత్రణ కార్యక్రమాలు, గ్రామాలలో అమలు తీరును వైద్యాధికారులు, సూపర్వైజర్స్ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్, ఎం పి ఓ శ్రీనివాస్, మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్. స్వప్నిక, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శారద, సూపర్వైజర్స్ ముత్తమ్మ , పద్మ , ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..
