
* దేశ మౌలిక వసతుల కల్పనలో రెండేళ్లలో సమూల మార్పు
* కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికా హైవేలుగా భారత దేశ రోడ్లను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. దేశ మౌలిక వసతులను రెండేళ్లలో సమూలంగా మార్చుతామన్నారు. ఈమేరకు కేంద్రం ప్రణాళికలు రూపొందించిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన కీలక విషయాలు వెల్లడించారు. భారత్(Bharath)లో రాబోయే రెండు సంవత్సరాల్లో అన్ని జాతీయ రహదారులు అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల అభివృద్ధి బాధ్యత తనపై పెట్టిందని, గత పదకొండు సంవత్సరాలలో అనేక ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, వంతెనలు, హైవేలు నిర్మించామని గడ్కరీ వివరించారు. ఒకప్పుడు గుంతలతో నిండి ఉండే రోడ్లను విదేశీయులు కూడా ఎగతాళి చేసేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని అన్నారు. రోడ్డు కనెక్టివిటీ పరంగా భారత్‌ను ప్రపంచంలోనే ఆదర్శ దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు.
………………………………….