* అల్లు అర్జున్‌కు మేం వ్యతిరేకం కాదు..
* డీజీపీ జితేందర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. పౌరుల భద్రత తమకు ముఖ్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సినీ ప్రమోషన్ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ప్రాధాన్యమన్నారు. పౌరుల రక్షణే తమకు ప్రాధాన్యమని, అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదని డీజీపీ తెలిపారు. చట్టప్రకారం అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్నామన్నారు.
………………………………..