
* రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు మండలం మదనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ క్రమములో పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని. ఆడబిడ్డలు, పేద కుటుంబాల భవిష్యత్తు కోసం ఈ పథకం ప్రారంభించామని అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాంఅని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు నమ్మకాన్ని ఉంచాలని సూచించారు. ఇప్పటికే 6 వేల ఇళ్లను మంజూరు చేశామని ఇంకా రాబోయే రోజుల్లో విడుతల వారీగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………….