– నాకోసం కష్టపడ్డారు.. ఇప్పుడు మీకోసం కష్టపడతా
– గెలిచిన తర్వాత పార్టీ మారితే బాగుండదు
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : రాబోయే స్థానిక ఎన్నికలలో కమలాపూర్ మండలంలో గులాబీ జెండా ఎగరవేస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.మండలంలోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరు దగ్గర, దూరం ఉండరని గులాబీ జెండా గెలుపు మాత్రమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాలని, ప్రత్యర్థి కంటే మెరుగైన అభ్యర్థిని గ్రామస్థాయిలో అందరూ కలిసి గుర్తించి, సమన్వయ కమిటీకి సిఫారసు చేయాలని అన్నారు. సర్పంచ్,ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించాక వారికి సపోర్ట్ చేసి గెలిపించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.కాంగ్రెస్ ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చదాక తను ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. అందుకే సీఎం తనని ఏమి చేయలేక తనపై 86 కేసులు పెట్టాడని అన్నారు. కెసిఆర్ హయాంలో హుజరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతున్న తట్టెడు మట్టి కూడా పోయలేదని, ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రోడ్డు అద్వాన స్థితిలో ఉందని కనీసం మట్టిపోసి గుంతలు పూడ్చటం లేదని విమర్శించారు.రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదని కౌశిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని అన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని, కానీ బీఆర్ఎస్లో మాత్రం ఒక్కటే వర్గం అన్నారు.గెలుపు ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కష్టమని మర్చిపోవద్దని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి, పార్టీ మారితే తాను ఊరుకోనని, ఇంటికి వచ్చి మరి ప్రశ్నిస్తానని అన్నారు.కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మణరావు, మారపల్లి నవీన్, సీనియర్ నాయకులు నాయినేని తిరుపతి రావు,సత్యనారాయణ రావు,కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య, సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
…………………………………..
