
* సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ప్రొఫెసర్ కోదండరాం( kodandaram),అమీర్ అలీఖాన్ (amir alikhan)లు నియామకాన్ని రద్దు చేస్తూ బధవారం సుప్రీంకోర్టు (supreme court) సంచలన తీర్పునిచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వీరిద్దరినీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ఎంపికచేసింది. అయితే వీరి నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీం ధర్మసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ (brs) నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ లు ప్రొఫెసర్ కోదండరాం,అమీర్ అలీఖాన్ ల నియామకం చెల్లదని కోర్టును ఆశ్రయించారు. బుధవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం వారి నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.2023 ఆగస్టులో బీఆర్ ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే అప్పుడు గవర్నర్ గా ఉన్నతమిళసై సౌందర రాజన్ (thamia si soundarrajan) వీరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోదండరాం,అమీర్ ఖాన్ లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. వీరి నామినేషన్లను గవర్నర్ ఆమోదించారు. తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజ్ శ్రవణ్(dasoju shravan), కుర్ర సత్యనారాయణలు (kurra satyanarayana) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
………………………………………..