* ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేస్తాం
* భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ఆకేరు న్యూస్ భూపాలపల్లి : ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాకీలను ప్రజలను వివరిస్తామని ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భూపాలపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ పంపిణీ చేస్తామన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని గండ్ర అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్తారని గండ్ర ధీమా వ్యక్తం చేశారు.
…………………………………………….
