* పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
* కొడకండ్ల మండలంలో రైతులకు విత్తనాల పంపిణీ
ఆకేరు న్యూస్ , పాలకుర్తి : రైతుల కష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల కేంద్రంలో జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ (ప్యాడీ) మరియు జాతీయ నూనెగింజల మిషన్ (గ్రౌండ్నట్) కార్యక్రమాల కింద రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక. రైతు బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. అందుకే ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తోంన్నారు. రైతులు పండించే ప్రతి గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విత్తనాల పంపిణీతో పాటు వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా దిగుబడులు పెంచడం లక్ష్యమని తెలిపారు. అలాగే రైతులు ఈ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, మద్దతు ధరలు, మరియు సాంకేతిక సాయం ద్వారా తమ వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి రైతు సంతోషంగా, స్వావలంబిగా ఉండడం నా లక్ష్యం. రైతులకు అవసరమైన సహకారం అందించడానికి ఎల్లప్పుడూ నేను ముందుంటాను. రైతు కష్టానికి గౌరవం దక్కేలా కృషి చేస్తాం, అని అన్నారు..
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, AMC వైస్ చైర్మన్ సాయి కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు, సొసైటీ సభ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు..
………………………………………………….
