
* అలాంటి దాడి జరిగితే ఊరుకోబోం
* మసూద్ కుటుంబం క్షిపణీ దాడుల్లో హతమైంది
* రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాకిస్థాన్ లాంటి దేశాలు అలాంటి దాడులకు పాల్పడితే, ఆపరేషన్ సిందూర్ మళ్లీ ప్రారంభిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (RAJNATH SINGH) స్పష్టం చేశారు. కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగానే నిలిపివేశామని ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(SECUNDERABAD PARED GROUND)లో బుధవారం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీవాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సాయుధ పోరాటంలో అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుదూ నిజాం మిలీషియా, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధపోరాటం, ఆపరేషన్ సింధూర్ మధ్య సమాంతరాన్ని చూపే ప్రయత్నం చేశారు. భారత సాయుధ దళాలు మతం ఆధారంగా కాకుండా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. పాకిస్థాన్ (PAKISTHAN) ఉగ్రవాదులు మాత్రం మతం అడిగి పహల్గామ్లో అమాయక పర్యాటకులను చంపారని గుర్తు చేశారు. అందుకు ప్రతీకారంగా భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో ఉగ్రవాద నాయకుడు మసూద్ అజార్ (MASUD Aకుటుంబం మరణించిందన్నారు. విభజన తరువాత జరిగిన అల్లర్ల మధ్య దేశాన్ని బలోపేతం చేయడంలో సర్ధార్ వల్లబాయ్‌పటేల్ పాత్రను ఆయన ప్రశంసించారు. పటేల్ చేసిన కృషిని మహాత్మాగాంధీ, జవహార్లాల్నెహ్రూ, డాక్టర్. బీఆర్. అంబేద్కర్ , డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి నాయకులు గుర్తించారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సర్ధార్ పటేల్ మార్గాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.
…………………………………………………..