* లా అండ్ ఆర్డర్ ను కాపాడతాం
* కానిస్టేబుల్ ప్రమోద్ కు నివాళులర్పించిన డీజీపీ శివధర్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ పూర్తి అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 17 న కరుడుగట్టిన నేరస్థుడు షేక్ రియాజ్ చేతిలో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఎంపల్లి ప్రమోద్ కుమార్‌కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయిన ప్రమోద్ భార్య ప్రణీతకు తండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లల భవిష్యత్ కు భరోసా ఇస్తామన్నారు. పోలీస్ శాఖ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు.జీవో ఆర్టీ నెంబ 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు డీజీపీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున డీజీపీ శివధర్ రెడ్డి నివాళులర్పించారు.తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని వెల్లడించారు.
…………………………………
