* ఫీడింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి
* బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
* తల్లి ఆహారానికి బిడ్డ అనారోగ్యానికి సంబందం లేదు
* బాటిల్ కు బదులు పాలెడీ ఉపయోగించాలి
* బాటిల్ శుభ్రంగా లేక పోతే ఇన్ పెక్షన్ వస్తుంది
* పిల్లలకు సూదులతో వాతలు పెట్టకూడదు
* పుట్టిన వెంటనే తల్లి పాలు తాగించాలి
ఆకేరు న్యూస్ డెస్క్ : చిన్న పిల్లల పెంపకం విషయంలో జాలా జాగ్రత్తలు తీసుకోవాలి..
ముఖ్యంగా శిశువు పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లల వైద్యుడు సురేందర్ సూచిస్తున్నారు.ఆకేరు న్యూస్ తో డాక్టర్ సురేందర్ చిన్న పిల్లల పోషణకు వారికి ఎలాంటి ఆహారం తినిపించాలి.. తల్లులు ముఖ్యంగా బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆకేరు ప్రతినిధికి వివరించారు.. పుట్టిన పిల్లలకు వెంటనే తల్లి పాలు తాగిస్తే మంచిదని సురేందర్ వివరించారు.. పుట్టిన వెంటనే పాలు తాగిస్తే పిల్లలకు జీవితాంతం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బాలింతలు తినే ఆహారంపై మహిళల్లో ఒక అభిప్రాయం ఉంది. తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే ఈ విషయాన్ని డాక్టర్ సురేందర్ ఖండించారు. తల్లి తీసుకునే ఆహారం బిడ్డపై ప్రభావం చూపదని వివరించారు. ఉదాహరణకు బాలింతలు ఐస్‌క్రీం తింటే పిల్లలకు జలుబు చేస్తుందనే అపోహ ఉంటుందని అది నిజం కాదని డాక్టర్ సురేందర్ వివరించారు. పిల్లలకు పాలు ఇచ్చే అప్పుడు తల భాగం పైకి ఉండేలా జాగ్రత పడాలన్నారు. లేకుంటే పిల్లల కడుపులోకి గాలి పోయి పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని డాక్టర్ తెలిపారు. ఒక వేళ పిల్లలకు పోత పాలు తాగిస్తే బాటిల్ లో కాకుండా పాలెడిలో తాగించాలని డాక్టర్ సూచించారు. బాటిల్‌ను శుభ్రం చేయడం కష్టమని దాంతో పిల్లలకు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వేడి నీళ్లతో పిల్లలకు ఫీడింగ్ చేసే వస్తువులనుశుభ్రం చేయాలని డాక్టర్ తెలిపారు. కన్నతల్లులు తీసుకునే ఆహారంలో ఎలాంటి నిషేదాలు లేవని ఏ ఆహారమైనా తల్లులు తీసుకోవచ్చని డాక్టర్ సురేందర్ సూచించారు. తల్లులు ఎంత ఎక్కు వ ఆహారం తీసుకుంటే పాల ఉత్పత్తి అంత ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వివరించారు. పిల్లలకు అరుగుదల శక్తి తక్కువగా ఉంటుందని ఆరునెలల తరువాత మెత్తటి ఉగ్గులాంటి ఆహారం తినిపించాలని డాక్టర్ సూచించారు. ఒక సంవత్సరం తరువాత ఆహారంలో క్రమక్రమంగా మార్పు తీసుకురావాలని ఆహారం కొద్ది కొద్దిగా ఘనంగా మార్చాలని కోరారు.పిల్లలకు మోషన్స్ రావడం సహజం అని మోషన్స్ వస్తే గాబరా పడాల్సి న పనిలేదన్నారు. మోషన్లో మొత్తం నీళ్లు ఉన్నా.. మోషన్ లో రక్తం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సురేందర్ సూచించారు.
తాయత్తులతో రోగాలు నయం కావు
ఇంట్లో పిల్లలకు ఏమైనా అయితే ఇంట్లో ఉన్న నాయనమ్మలు,అమ్మమ్మలు నానా హంగామా చేస్తారు. పిల్లలకు తాయత్తులు కడితే జబ్బు నయం అవుతందనే మూఢనమ్మకం సమాజంలో బలంగా ఉందని మంత్రాలను ఆశించకుండా వైద్యుడి సలహా తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే సూదులతో కాల్చే ప్రయత్నాలు చేయకూడదని డాక్టర్ హెచ్చరించారు. కాల్చే క్రమంలో లోతుగా గాయం అయితే ఇన్ ఫెక్షన్ ఏర్పడి పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని డాక్టర్ సురేందర్ హెచ్చరించారు.
విత్తనాలకు దూరంగా ఉండాలి
పిల్లలకు నాలుగైదు ఏళ్లు వచ్చే వరకు విత్తనాలు ఉండే ఆహారాన్ని తిన్పించకూడదని డాక్టర్ హెచ్చరించారు. విత్తనాలు ఊపిరితిత్తులతో చేరితే శ్వాస ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు.
………………………………………………..
