
* జూన్ 4లోగా నివేదిక ఇవ్వండి
* వాటర్ బోర్డు ఎండీకి హెచ్ ఆర్సీ ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad) మహానగరాన్ని మ్యాన్ హోల్స్ లీకేజీలు పట్టి పీడిస్తున్నాయి. ఏ వీధి చూసినా రోడ్డుపై డ్రైనేజీ పొంగులే కనిపిస్తున్నాయి. డ్రైనేజీ నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ లీకేజీ అయి ప్రజల ఇబ్బందులపై హ్యూమన్ రైట్స్ కమిషన్ (Human Rights Commision) సీరియస్ అయింది. మ్యాన్ హోల్స్ లీకేజీ.. ప్రజల అసౌకర్యంపై సుమోటోగా కేసు నమోదు చేసింది. లీకేజీ ఘటనలపై విచారణకు కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4లోగా నివేదిక సమర్పించాలని వాటర్ బోర్డు (Water Board) ఎండీకి ఆదేశాలు జారీ చేశారు.
……………………………………………………..