
* ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేఖా గుప్తా
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ఎన్నికల హామీల్లో భాగంగా.. ప్రతీ మహిళ ఖాతాలో రూ.2,500 ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఆ పథకం నిమిత్తం నిధులు కేటాయించలేదు. ఆ ప్రస్తావన లేదు. కానీ, ఇటీవలే ఢిల్లీ(Delhi)లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం(Bjp Government), ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు తొలి బడ్జెట్లోనే రూ.5100 కోట్లు కేటాయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha guptha) మంగళవారం శాసనసభలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి నెలా 2,500 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే, ప్రసూతి పథకం కింద గర్భిణీ మహిళలకు 21,000 రూపాయలు ఇస్తారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ఆమోదం లభించింది. దీంతో తెలంగాణలో జరగనిది.. ఢిల్లీలో జరగబోతోందనే చర్చ మొదలైంది.
………………………………..