
* 48 గంటలు గడవడంతో పెరుగుతున్న ఆందోళన
* టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC TUNNEL) వద్ద ప్రమాదం జరిగి 48 గంటలు దాటిపోయింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సొరంగం 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. 48 గంటలు దాటినా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో ఆందోళన పెరిగిపోతోంది. వారి కోసం గాలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి సహాయక బృందాలు టీబీఎం(TBM)లోకి ప్రవేశించాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)ను దాటి సహాయక బృందాలు వంద మీటర్లు లోనికి ప్రవేశించాయి. అక్కడ పూరుకుపోయిన మట్టిని తీస్తే మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందా అని సమీక్షిస్తున్నాయి. టన్నెల్ (TUNNEL) రెండు పంపింగ్ స్టేషన్ల మధ్య భారీగా నీరు నిలిచిపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రత్యేకంగా భారీ పంపులను తెప్పించి సిబ్బంది డీవాటరింగ్ చేస్తున్నారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది.
ప్రాణాలతో బయటపడాలని ప్రార్థనలు
సహాయ బృందాల అధికారులు టన్నెల్ బయట అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. సొ రంగంలో ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిక్కుకున్న తమవారు క్షేమంగా బయటపడాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. సహాయ చర్యలను మం త్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కర్నూలు కలెక్టర్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
………………………………………