* సీిఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఉపాధిహామీ పనిదినాలు 2024-25 సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 సార్లు ఢిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయని విమర్శించారు. విషయం తెలిసినా కాంగ్రెస్, భాజపా ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండిరగ్లో ఉన్నాయని.. వెంటనే కూలీల పనిదినాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. తెలంగాణకు సాధించింది ఏం లేదని హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
…………………………..
