
* నార్సింగ్‌లో అక్రమ నిర్మాణాలు బాగా పెరిగాయ్
* ప్రజలు కోరుకునేది ఒకటి.. ప్రభుత్వం చేస్తున్నదని మరొకటి
* బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజలు కోరుకునేది ఒకటైతే, ప్రభుత్వం చేస్తున్నదని మరొకటి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Mp Raghunandan Rao) విమర్శించారు. సర్కారు మూసీ జపం చేస్తోందని అన్నారు. గండిపేట నార్సింగ్ వద్ద ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు అక్రమమా, సక్రమమా అనే చర్చ నడుస్తుండడంతో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూలుస్తోందని విమర్శించారు. నార్సింగిలో అక్రమ నిర్మాణాలు బాగా పెరిగిపోయాయని, ఆదిత్య వింటేజ్ బంగ్లాను పూర్తిగా మూసీ పరివాహకంలో నిర్మిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ఆ బంగ్లా నిర్మాణాన్ని నిలిపేస్తామని చెప్పారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే తాను కోర్టుకు వెళ్తానని, ఆదిత్య వింటేజ్ బంగ్లాపై ఏ గద్ద వాలిందో.., ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్లిందో అక్కడే తేల్చుతా అని హెచ్చరించారు.
………………………………………….