
* లక్ష్మణ్ ను కొంత మంది రెచ్చగొట్టారు
* ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారు
* మంత్రి వివేక్ వెంకట స్వామి
ఆకేరు న్యూస్ నిజామాబాద్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కొంత మంది రెచ్చగొట్టారని గనులు కార్మిక ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన నిజమాబాద్ లో నిర్వహించిన మాలల ఐక్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది తనను సోషల్ మీడియాలో కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తే తనకు పేరు వస్తుందని ఓర్వలేక తనపై విమర్శలు చేస్తున్నారని వివేక్ ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను అపార్థం చేసుకున్నారని జూబ్లీ హిల్స్ లో సమావేశం జరిగినప్పుటు లక్ష్మన్ వచ్చిన సమయంలో తాను వెళ్లిపోతున్నాను అని అనటం అబద్దం అన్నారు. కొంత మంది కావాలనే లక్ష్మణ్ ను రెచ్చగొట్టారని ఆరోపించారు.తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్‌ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామేనని వివేక్ గుర్తు చేశారు. తనకు ఎవరితో విఢేదాలు లేవని అందరినీ కులుపుకుపోయి పనిచేస్తానని అన్నారు.
…………………………………