
* ఇది ప్రజాపాలన కాదు.. పీడించే పాలన
* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పర్యటన జరిగిన ప్రతిసారీ ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు? సీఎంకు అంత భయమెందుకు అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. పీడించే పాలన అని దుయ్యబట్టారు. జహీరాబాద్‌లో రైతుల అరెస్టును ఖండించారు. మొన్న నాగర్‌కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను అక్రమంగా అరెస్టు చేశారు… నేడు జహీరాబాద్(Zahirabad)లో రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం ఏ విధంగా ప్రజాపాలన అవుతుంది? ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఈ హక్కును హరించడం దుర్మార్గం. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటన జరిగే పరిస్థితి లేదు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ డీజీపీనిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
………………………………………………