* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన కేబినేట్ సమావేశంలో పలు విషయాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఓఆర్ఆర్కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రాకు అధికారాలు కలించామని అలాగే 150 మంది అధికారులను, 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, చాకలీ ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 60 మంది విద్యార్థులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించామని ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చామని వివరించారు. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సన్నవడ్లకు 500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని, జనవరి నుండి రేషన్కార్డ్లకు సన్నబియ్యం ఇస్తామన్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీపై గతంలో కెసిఆర్ వ్యంగంగా మాట్లాడుతూ నిర్లక్ష్యం చేశారని.. రెండు పంటలకు కలువ ద్వార ఎస్ఎల్బీసీ ద్వారా నిల్లొస్తాయని తెలిపారు.
……………………………