
* వారి జాడ తెలిసే చాన్స్
* ఎస్ ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో మూడు షిప్టుల్లో 150 మంది
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 షిప్టుల వారీగా 150 మంది పది రోజులుగా వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) కూడా సొరంగ మార్గంలో కిలోమీటరు వరకూ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. తాజాగా టన్నెల్లో ఆరు ప్రాంతాల్లో ఎన్ జీఆర్ఐ టీమ్ (NGRI TEAM) మార్కింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో రెస్క్యూసిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్ జీ ఆర్ఐ అధికారులు చేసిన మార్కింగ్ ప్లేస్ లో ఒక్క ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఐరన్ పైపులు బయటపడ్డాయి. దీంతో మిగిలిన ఐదు చోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే, టన్నెల్ (TUNNEL)లో తవ్వకాలు జరుపుతున్న సమయంలో భూమి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఇది రెస్క్యూ ఆపరేషన్స్ కు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే ఉబికి వస్తున్న నీరు వల్ల పగుళ్లు వచ్చే అవకాశం ఉందా అనే ఆందోళన కలుగుతోంది. కాగా, అన్నీ అనుకూలిస్తే టన్నెల్ లో బురద తొలగింపు ఈ రోజు రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. మరో వైపు టన్నెల్ లో కన్వేయర్ బెల్ట్ కు రిపేర్స్ ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉంది.
………………………………………..