
ఎమ్మెల్సీ కవిత
* కాసేపట్లో కవిత ప్రెస్ మీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్ లో కవిత ఏం చెప్పబోతున్నారనే దాని మీద నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ తో పాటు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత మొట్టమొదటి ప్రెస్ మీట్ కావడంతో అన్ని సంచలన విషయాలే బయటకు వస్తాయని అనుకుంటున్నారు. ఈ సారి కవిత ఎవరిని
టార్గెట్ చేయనున్నారనేదాని మీద చర్చ నడుస్తోంది.పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కవిత కేటీఆర్ ల మధ్య కూడా గ్యాప్ ఏర్పటినట్లు తెలుస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవిత స్థానంలో ఉన్నట్లుండి కవిత అమెరికా పర్యటనలో ఉండగాఆ స్థానంలో కొప్పుల ఈశ్వర్ ను నియమిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.ఇది కవితకు ఊహించని
పరిణామంగా చెప్పవచ్చును. పార్టీలో అగ్రనేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ నేపధ్యంలోనే గత కొంత కాలంగా ఆమె కొత్త పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ తనను సస్పెండ్ చేసేలా చేసుకున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి. అయితే కవిత నిర్వహించే ప్రెస్ మీట్ లో బీఆర్ ఎస్‌లో చోటుచేకున్నపరిణామాలు,పార్టీలో ఉన్న లుకలుకలు అన్నీ బహిర్గతం కావచ్చని అనుకుంటున్నారు. ఈ సారి కొన్ని కొత్త దెయ్యల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కొత్త పార్టీపై ప్రకకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
……………………………………