
* అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని పనులను తాము 10 నెలల్లో చేశామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రకటించారు. వడగళ్ల వానతో పంట నష్టం జరిగితే గత ప్రభుత్వం ఏనాడూ పంట నష్టం ఇవ్వలేదన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్ర అప్పు రూ. 72వేల కోట్లని వివరించారు. కార్పొరేషన్ అప్పులు కూడా కలిపితే 90 వేల కోట్లని అన్నారు. ఈ పదేళ్లలో ఎఫ్ఆర్ బీఎం అప్పులే 3 లక్షల కోట్లు దాటాయన్నారు. మాకు అధికారం అప్పగించేనాటికి ఉన్న అప్పు 6.69 లక్షల కోట్లని సీఎం వెల్లడించారు. పెండింగ్ బిల్లులే రూ.40వేల కోట్లు పెట్టి వెళ్లిపోయారని వివరించారు. కేసీఆర్(Kcr) దిగిపోయేటానికి అన్ని అప్పులూ కలిపి 8.19 లక్షల కోట్ల అప్పు ఉందని వివరించారు. తాము 15 నెలల్లో 1.58 లక్షల కోట్ల అప్పు చేశామని వివరించారు. కొత్తగా చేసిన అప్పుల్లో 1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామన్నారు. బీఆర్ ఎస్ (Brs) మొదట విడత ప్రభుత్వం కేవలం 13 వేలు కోట్లు రుణమాఫీ చేసిందని, అందుకు 5 ఏళ్ల సమయం పట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 26వేల కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు.
………………………………