
* కర్ణాటక డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
* మరోసారి తెర మీదకు కర్ణాటక రాజకీయం
ఆకేరు న్యూస్ డెస్క్ : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఆశ లేకపోతే జీవితమే లేదంటూ అన్నారు ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025 సదస్సులో
డీకే శివకుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మీరు మళ్లీ డిప్యూటీ సీఎం పదవికే పరిమితం అవుతారా అనే ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. అయితే గత కొంత కాలంగా కర్ణాటకలో అధికార మార్పిడి జరుగనుందన్న ఊహాగానాల నేపధ్యంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక రాజకీయాల్లో అపర చాణక్యుడిగా, ట్రబుల్ షూటర్ పేరుంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే శివకుమారే కారణమంటారు. 2023 మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పడు డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవుతాడని అందరూ భావించారు. ఈ నేపధ్యంలో పార్టీ అధిష్టానం డీకేకు ఇంకా భవిష్యత్ ఉందని నచ్చజెప్పి సీనియర్ నేత అనుభవశాలి అయిన
సిద్ది రామయ్యను సీఎం చేసింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు డీకే శివకుమార్
డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు కర్ణాటకలో
సీఎం మార్పు ఖాయమనే వార్తలు గుప్పుమంటుంటాయి. ఈ నేపధ్యంలో డీకే చేసిన
వ్యాఖ్యలపై మళ్లీ చర్చ మొదలైంది.
………………………………………….