
* పొంగులేటిపై పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు
* మంత్రుల పంచాయతీలో మరో మలుపు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : నిన్నటి వరకూ మంత్రి కొండా సురేఖ ( konda surekha)జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ponguleti srinivas reddy) ల మధ్య ఉన్న పంచాయతీ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కొండా సురేఖ తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మహిళా మంత్రి సీతక్క(seethakka) కూడా పొంగులేటి వ్యవహార శైలిపై అంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమ జిల్లా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని ఇద్దరు మహిళా మంత్రులు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.తాజాగా మేడారం (medaram)జాతరకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ టెండర్లలో అధిక శాతం పనుల టెండర్లను పొంగులేటి తన వర్గాన్ని ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే రోజురోజుకూ ముదురుతున్నా ఈ పంచాయతీ ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు చేరినట్టు తెలుస్తోంది. ఇంతకు మందు కొండా దంపతులకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు మధ్య వివాదం కొనసాగిని విషయం తెల్సిందే . మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకున్న విషయం తెల్సిందే.. కొండా దంపతులకు ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న వివాదం లో పీసీసీ చీఫ్ కలుగచేసుకోగా కొండా మురళి (konda murali) గాంధీ భవన్ (gandhi bhavan)లో వివరణ కూడా ఇచ్చారు. ఇంకా ఆ వివాదం గురించి జిల్లా ప్రజలు పూర్తిగా మరిపోక ముందేతాజాగా ఇద్దరు మహిళా మంత్రులకు జిల్లా ఇన్ జార్జి మంత్రికి మధ్య వివాదం చోటుచేసుకుంది.
……………………………………………………………….