
* పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* కేయూలో ఘనంగా మహిళా దినోత్సవం
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా విద్యా రంగం బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ గోదారెడ్డి, ఈసీ మెంబర్ చిర్ర రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్జెల మల్లేష్, సురాసి కృష్ణ, తీగల ప్రేమ్ చందర్, సోల్తి కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………….