
* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బాధ్యతతో పని చేస్తే కలిగే తృప్తే వేరని డిప్యూటీ సీ ఎం మల్లు భట్టి విక్రమార్క ( DEPUTY CM BHATTI VIKRAMARKA) అన్నారు. ప్రజలకు కూడా చిరకాలం గుర్తుండి పోతారని అన్నారు. మిషన్ లాగా పనిచేస్తే ప్రజలు కూడా మర్చిపోతారని అన్నారు. లక్ష్యాన్ని పెట్టుకొనిపనిచేయాలని భట్టి కోరారు. సోమవారం ప్రజాభవన్(PRAJA BHAVAN) లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్స్ 2025 మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు ఆయన లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ అభయహస్తం విజయవంతంగా రెండో సారి అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని భట్టి అన్నారు.సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికులు సంస్థను బతికిస్తూ సింగరేణి సంస్థ ద్వారా కొన్ని లక్షల మందిని బతికిస్తున్నారని భట్టి అన్నారు. మెయిన్స్ పరీక్షకు ఎంపికైన 178 అభ్యర్థులకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
………………………………………………