
* రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
* పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో తెలంగాణ మహిళలు పోటీ పడుతున్నారు
* భారత్ సమ్మిట్లో రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదేళ్లుగా ప్రపంచ రాకీయాలు మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (RAHUL GANDHI)అన్నారు. హైదరాబాద్ (HYDERABAD) హెచ్ ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ నిన్ననే సమ్మిట్లో పాల్గొనాల్సి ఉందని, కశ్మీర్ వెళ్లాల్సి రావడం వల్ల రాలేకపోయానని అన్నారు. ఆధునిక సాంకేతిక మాధ్యమాలతో అంతా మారిపోతోందన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, పాదయాత్ర మొదలు పెట్టక ముందు ఆలోచించానని, మొదలు పెట్టాక వెనుకడుగు వేయలేదని తెలిపారు. పాదయాత్ర మొదలు పెట్టాక చాలా మంది తనతో కలిసి నడవడం మొదలుపెట్టారని అన్నారు. పాదయాత్రలో జనం మాటలు విని చాలా నేర్చుకున్నానన్నారు.
ఉచిత ప్రయాణం కోసం రూ.5వేల కోట్లు ఖర్చు
రైతులు, మహిళలు, యువతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ మహిళలు పోటీ ఇస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కోసం రూ.5వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మూసీ పునరుజ్జీవనానికి సంకల్పించామన్నారు. 30 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మించబోతున్నామన్నారు. గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ లక్ష్యమని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీకి శ్రీకారం చుట్టామన్నారు. రైతులకు రూ.20 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చామని వివరించారు. యువత రాజీవ్ యువ వికాసం పథకం తెచ్చామని తెలిపారు.
…………………………………………..