* వైసీపీ విజయాన్ని టీడీపీ ముందే అంగీకరించినట్లుగా సారాంశం
* టీడీపీ అంతర్గత సమావేశంలో చర్చకు చెందిన వీడియో వైరల్
* ఎక్స్ వేదికగా పోస్టు చేసిన వైసీపీ
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా వైసీపీ విడుదల చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. రాష్ట్రంలోని 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందని టీడీపీ అంతరంగిక సమావేశంలో ఆ పార్టీ ఎలక్షన్ సెల్ కో ఆర్డినేటర్ కోనేరు సురేశ్.. శ్రేణులకు వివరిస్తున్న వీడియో వైసీపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసింది. ‘‘టీడీపీ సంచలన వీడియో లీక్. ఓటమిని ముందే ఒప్పుకున్న టీడీపీ. రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంలో ఉందని టీడీపీ అంతర్గత సమావేశంలో ఒప్పుకుంది. ’’ అని ఒక వీడియోను పోస్టు చేసింది. 147 నియోజకవర్గాల్లో వైసీపీకి, టీడీపీకి అంతరం చాలా తక్కువగా ఉందని కోనేరు వివరిస్తున్నట్లుగా అందులో ఉంది. ఈ వీడియోను వైసీపీ విపరీతంగా వైరల్ చేస్తోంది. దీనిపై టీడీపీ స్పందించాల్సి ఉంది.
——————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
