
ఆకేరున్యూస్, హైదరాబాద్: విద్యాశాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి యోగితా రాణా నియమితులయ్యారు. యోగితా రాణా ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. కాగా.. విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్న బుర్రా వెంకటేశంను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. దీంతో ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా యోగితా రాణాను సెక్రెటరీగా నియమించడంతో శ్రీధర్‌ను ఆ బాధ్యతల నుంచి విద్యాశాఖ రిలీవ్ చేసింది. అలాగే ఎన్. శ్రీధర్‌కు గనుల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా 2006 బ్యాచ్‌కు చెందిన కే. సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.
………………………………………….