
– హైదరాబాద్‌లో ప్రత్యేక ముఠా
– 9 మందిని కాపాడిన పోలీసులు
అకేరు న్యూస్, హైదరాబాద్ : ఉద్యోగం, ఉపాధి పేరుతో ప్రకటనలు ఇచ్చి యువతులను ఆకర్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వారు వచ్చాక నయానో భయానో పడుపువృత్తిలోకి దించుతున్నారు. మరికొందరికి డబ్బులు ఆశచూపి వ్యభిచారం చేయిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) లో తిష్ట వేసిన అలాంటి ముఠా ఆటకట్టించారు పోలీసులు. వ్యభిచారకూపం నుంచి 9 మందిని రక్షించారు. సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేప్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగాల పేరుతో పేద అమ్మాయిలను ప్రలోభ పెట్టి పశ్చిమబెంగాల్(west bengal), ఢిల్లీ(Delhi), జార్ఖండ్, హర్యానా, పంజాబ్‌ల నుంచి తీసుకొచ్చారు. వారిని వ్యభిచార కార్యకలాపాల్లో బలవంతం తీసుకువస్తున్నారు. ఇతర దేశాలైన ఉజ్బెకిస్తాన్, తుర్కెమిస్తాన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 9 మందిని అక్రమంగా తీసుకు వచ్చారు. వీరిందరినీ మాదాపూర్ (Madapur)పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్‌నగర్-గాయత్రీనగర్ ప్రాంతంలో ఉన్న బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ అండ్ లివింగ్ హోటల్ ఉంచారు. వారితో వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు సైబరాబాద్ యాంటీ హుమన్ ట్రాఫికింగ్ బృందం దాడులు చేసి 9 మంది యువతులను రక్షించారు. ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో ప్రధాన నిర్వాహకుడైన హ్యమర్ సింగ్ అలియాస్ అమిద్ సింగ్. సూపర్వైజర్ తమ్మి శ్రీనివాస్‌లతో పాటు పోకల వెంకటేశ్వర్లు, బెక్మెటోవా గుల్షాత్, రక్మనోవ మాలిక అలియాస్ లోనివ బోర రక్ మనోవ మాలిక, లక్ష్మణ్ తూము, ఆకాష్ బజాజ్, గోర మహ్మద్ వాసిమ్, పార్తీబన్ కె.పార్తిబన్‌లు ఉన్నారు. వీరంతా కలిసి లోకాంటో, స్కోకా పేర్లతో ఉన్న వెబ్ సైట్లను ప్రచారం చేసి విటులను ఆకర్షిస్తున్నట్లు విచారణలో తేలింది.
………………………………………………………….