* జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్
ఆకేరు న్యూస్, ములుగు: టాస్క్ ఆధ్వర్యంలో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ లో ఉద్యోగ అవకాశాలను ములుగు జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ కేంద్రం ఆధ్వర్యంలో టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలను 2024 – 25 సంవత్సరం లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువత అర్హులని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 100 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని , ఆసక్తిగల యువత 9618449360 నెంబర్ ద్వారా లేదా పోస్టర్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు తేది.01.12.2025 తేదీన ములుగు రీజినల్ సెంటర్ నందు సెలక్షన్ నిర్వహించబడుతుందని, ఎంపికైన అభ్యర్థులకు తొమ్మిది రోజులపాటు శిక్షణ అందించబడుతుందని అనంతరం టెలి పర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నందు 20వేల రూపాయల వరకు వేతనం తో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందని, ములుగు జిల్లా యువత ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.
………………………………………..
