– వినూత్నంగా శ్రమదానం చేస్తూ రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : లోక్ సభ ఫ్లోర్ లీడర్ ,కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో యువకులు గురువారం శ్రమదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు చీపురు కట్టలు చేతబట్టి, స్థానిక రైల్వే స్టేషన్,బస్స్టాండ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రయాణికులకు అల్పాహారం అందించారు. అనంతరం శ్రమదానం చేస్తూ రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ప్రజలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు చేరాల రోహిత్, ఆడెపు శ్రీకాంత్, పుల్ల వెంకటేష్, ఎండి ఆఫీస్, మిల్కురి అరవింద్, వైనాల వంశీ , మెరుగు గణేష్, ఉప్పల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొండెద్దుల నాగరాజ్, మారపల్లి సత్యపాల్, పంజాల రాజేష్, చల్లూరి హరీష్, మొండెద్దుల సంపత్, ఎండి జలీల్, రాకేష్, అజయ్, నేదునూరి నాగరాజు పాల్గొన్నారు.

……………………………………………………….

If Congress government baguntea youth vachi cheyavalasina pani ldhu. Avi cheyadani government jenalani hire chesthadi. vallaki sariga salary evvaka meru valli clean cheyavalasina pani ochindi.. m anna chesthea koncham bayata jenalaki use ayyeala cheyandi.. meru adi cheyadam valla avariki use ldhu.. thank you.